ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు హైలెట్ గా నిలిచాయి. పొలార్డ్ బాదుడి ధాటికి బంతులు రెండుసార్లు గ్రౌండ్ బయట పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తొలిసారి గ్రౌండ్ బయటికి సిక్స్ కొట్టినప్పుడు ఆ బంతిని గ్రౌండ్ బయట ఉన్న వ్యక్తి ఇవ్వలేదు. ఆ బాల్ ను తీసుకుని వెళ్లిపోయాడు. రెండోసారి కొట్టిన బంతిని ఇంకో వ్యక్తి స్టేడియంలోకి విసిరాడు.
When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you?
దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. మీరు బాల్ ను తిరిగిస్తారా? ఇవ్వరా అంటూ వీడియోకు క్యాప్షన్ ను పెట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంఐ ఎమిరేట్స్, డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ 241 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆండ్రీ ఫ్లెచర్ 50, ముహమ్మద్ వాసీమ్ 86, కీరెన్ పొలార్డ్ 50 పరుగులు చేశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో చతికిల పడిన డెజర్ట్ వైపర్స్ టీమ్ 84 పరుగులకే ఆలౌట్ అయ్యింది.