ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీలో బౌలింగ్ వేశాడు. బంగ్లాదేశ్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హార్థిక పాండ్యాకు గాయం అయ్యింది. దీంతో పాండ్యా ఓవర్‌ను కోహ్లీ ఫినిష్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ODI ప్రపంచ కప్‌లో భారత్ విజయాల పరంపరతో జోరుమీదుంది. ఈ క్రమంలో నేడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న 17వ మ్యాచులో ఇండియా గెలుస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు రెండు మ్యాచులు ఓడిన బంగ్లా జట్టు ఇది తప్పక గెలవాలని చూస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారు అతివేగంగా నడపడం వల్ల ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు.
నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 289 పరుగుల టార్గెట్‌ను ఆఫ్ఘన్ చేరుకోలేకపోయింది. 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ తన నాలుగో మ్యాచును బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రేపు జరగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
రేపు జరగబోయే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే తాను బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేట్ చేస్తానని ఓ పాకిస్తాన్ నటి ఆఫర్ ఇచ్చింది. భారత్‌ను ఎలాగైనా ఓడించాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంగ్లాండ్‌పై మంచి విజయం తర్వాత ఆప్గానిస్తాన్(Afghanistan) జట్టు కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్(New Zealand)తో తలపడుతుంది. ఇక మొదట టాస్ గెల్చిన ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ఈ కీలక మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
పాకిస్థాన్ జట్టును విష జ్వరాలు బాధిస్తున్నాయి.
వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. సౌతాఫ్రికా జట్టును ఆరెంజ్ ఆర్మీ ఓడించింది. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నాడు. స్టేడియంలో నమాజ్ చేసినందుకు న్యాయవ్యాది వినిత్ జిందాల్ అతనిపై ఫిర్యాదు చేశారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి మరణించినట్లు ఈ మేరకు ప్రకటించగా..పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
వరల్డ్‌కప్ 2023లో భాగంగా నేడు లక్నోలో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడినా వర్షం తగ్గిన తరువాత ఆటను కొనసాగించారు. ఆసీస్ బౌలింగ్ దాడికి వికెట్లు నష్టపోయిన శ్రీలంక ఫైనల్‌గా 209 రన్స్ కొట్టింది.
ఐసీసీ ODI ప్రపంచ కప్ 2023లో నేడు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఓసారి అంచనాలను చుద్దాం.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాకిచ్చింది. 69 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది.