• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

నిప్పులు చెరుగుతున్న సౌతాఫ్రికా బౌలర్లు

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వెస్టిండీస్ 8.2 ఓవర్లలో కేవలం 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రబడ 2, లుంగి ఎన్గిడి 3 పడగొట్టారు. ప్రస్తుతం హోలర్డ్(9), ఫోర్డ్(1) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ప్రదర్శనతో భారత అభిమానుల్లో సెమీస్ ఆశలు చిగురిస్తున్నాయి.

February 26, 2026 / 03:53 PM IST

జమ్మూకశ్మీర్ కెప్టెన్‌కు బీసీసీఐ భారీ షాక్

జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. రంజీ ఫైనల్లో నిన్న కర్ణాటక ఫీల్డర్ అనీశ్‌‌ను పారస్ హెల్మెట్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనపై తాజాగా మ్యాచ్ రిఫరీ నారయణ్ స్పందిస్తూ.. JK సారథి డోగ్రాకు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా, ఈ మ్యచ్‌లో JK తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

February 26, 2026 / 03:53 PM IST

IPL: లక్నో టీమ్‌ కీలక నిర్ణయం

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను LSG నియమించుకుంది. అభయ్ శర్మ 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేశాడు. భారత్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడి 4105 పరుగులు చేశాడు.

February 26, 2026 / 03:30 PM IST

టీమిండియా సెమీస్ చేరుకోదు: అమీర్

టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించదని అభిప్రాయపడ్డాడు. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

February 26, 2026 / 03:10 PM IST

SA vs WI: హెడ్ టు హెడ్ రికార్డు

సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్‌లో విండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.

February 26, 2026 / 02:51 PM IST

SA vs WI: ప్లేయింగ్-11

WI: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (w/c), షిమ్రాన్ హెట్మేయర్, పావెల్, రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్SA: మార్‌క్రమ్ (c), క్వింటన్ డికాక్ (w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో యాన్‌సన్, కార్బిన్ బాష్, రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి

February 26, 2026 / 02:38 PM IST

T20 WC: కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా

అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ ఆశలు సౌతాఫ్రికా విజయంపై ఆధారపడి ఉన్నాయి. సౌతాఫ్రికా ఓడితే భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా సెమీస్ చేరుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే సఫారీలను ఓడించడం జింబాబ్వేకు అంత సులభం కాదు.

February 26, 2026 / 02:35 PM IST

రంజీ ఫైనల్‌: జమ్మూకశ్మీర్‌ ఆలౌట్

కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 584 పరుగులకు ఆలౌటైంది.  శుభమ్(121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

February 26, 2026 / 02:23 PM IST

T20 WC.. భారత్‌కు జింబాబ్వేతోనే ముప్పు: కృష్ణమాచారి

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ టీమిండియా, జింబాబ్వే తలపడనున్నాయి. అయితే సూపర్‌-8లో టీమిండియాకు వెస్టిండీస్‌తో కన్నా.. జింబాబ్వేతోనే ఎక్కువ ముప్పు ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. కాగా సూపర్ -8లో సౌతాఫ్రికాతో భారత్ తలపడగా ఓడిపోయింది. దీంతో వెస్టిండీస్‌, జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది.

February 26, 2026 / 01:27 PM IST

శివ‌మ్ దూబే ఫేవరెట్ హీరో ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే  తెలిపాడు. హిందీ డబ్బింగ్‌లోనూ తాను తెలుగు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలను అస్సలు మిస్ అవ్వనని పేర్కొన్నాడు. సూపర్ స్టార్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనలోని గ్రేస్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

February 26, 2026 / 12:39 PM IST

భారత్, జింబాబ్వే మ్యాచ్.. మెట్రో ప్రయాణం ఉచితం

క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.

February 26, 2026 / 07:18 AM IST

T20 WC: మళ్లీ ఓడిన శ్రీలంక

పొట్టి మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తమ రెండో సూపర్ 8 మ్యాచులోనూ శ్రీలంక ఓడింది. తొలుత కివీస్ 168/7 స్కోర్ చేయగా..  లక్ష్యచేధనలో లంక ఆరంభం నుంచే తడబడుతూ వచ్చి 115/9 మాత్రమే చేయగలిగింది. టోర్నీ తొలి 3 మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత మూడింటిలోనూ పరాజయంపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 25, 2026 / 10:30 PM IST

టీమ్ సెలక్షన్ పై శ్రీకాంత్ ఫైర్

భారత్ తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. అసలు కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. ఇలాంటి చెత్త ప్రయోగాలతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని వ్యాఖ్యానించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నాడు.

February 25, 2026 / 09:40 PM IST

రేపు జింబాబ్వేతో ‘డూ ఆర్ డై’ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రేపు కీలక మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఇందులో భారత్ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

February 25, 2026 / 09:20 PM IST

సూర్య కెప్టెన్సీపై వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ ఒక అద్భుతమైన ఆటగాడని, అంతకు మించి గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే అది మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించాడు.

February 25, 2026 / 09:03 PM IST