రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
2023కి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు వరించగా.. అయిదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు వరించాయి.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నిన్న దుబాయ్‌లో జరిగింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఆటగాళ్లు పదిరెట్లు కంటే ఎక్కువ మొత్తంలో వీళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నేడు(డిసెంబర్ 19న) దుబాయ్‌లో మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఐపీఎల్ చరిత్రలో విదేశాల్లో వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆప్గానిస్తాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై అంతర్జాతీయ లీగ్ టీ20 20 నెలల నిషేధం విధించింది. షార్జా వారియర్స్‌తో తన ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు నవీపై ఈ చర్య తీసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
భారత బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో 116 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా, అవేష్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.
టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్లకు పైగా తీసి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా జట్టులో 500కు పైగా వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు తీసిన 8వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆ టీమ్ కోసం ఆడి, ఐదు సార్లు కప్ గెలిపించిన కెప్టెన్‌ను ఎలా మారుస్తారు అని నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
ఇంగ్లండ్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 347 పరుగుల తేడాతో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ భారత మహిళలు అద్భుత ప్రతిభను కనబరిచారు.
ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కకు పెట్టడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
2013 ఐపీఎల్ సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని ఐపీఎల్ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.