• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

రంజీ ఫైనల్: తొలి రోజే జమ్మూకశ్మీర్ భారీ స్కోరు

కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 284/2 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఇక్బాల్(6) త్వరగానే అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ హసన్(88) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం పుండిర్(117) సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో డోగ్రా(9), అబ్దుల్ సమద్ (52) ఉన్నారు.

February 24, 2026 / 06:08 PM IST

భారత జట్టులో ‘కోల్డ్ వార్’ నడుస్తోందా..?

పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అతడు ఆరోపించాడు. ఆ కారణంతోనే కుల్దీప్‌ను సూర్య జట్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో బహిరంగంగానే బయటపడ్డాయని షెహజాద్ వ్యాఖ్యానించాడు.

February 24, 2026 / 05:37 PM IST

BREAKING: టీమిండియా కెప్టెన్‌కు గాయం

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మోకాలి నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో హర్మన్ ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమెను వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. అయితే, 36 ఏళ్ల హర్మన్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోంది.

February 24, 2026 / 04:22 PM IST

టీమిండియా ‘150 లోడింగ్’ మీమ్స్.. వైరల్

WCలో టీమిండియా పేలవ ప్రదర్శనపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు ‘300 రన్స్ లోడింగ్’ అంటూ భారీ అంచనాలు పెట్టుకున్న నెటిజన్లు.. ఇప్పుడు జట్టు తీరుపై సెటైర్లు వేస్తున్నారు. SAతో భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ‘150 లోడింగ్’ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. భారత ఆటతీరుపై నెటిజన్లు ఈ విధంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 04:03 PM IST

ఆసీస్‌తో తొలి వన్డేలో భారత్ ఓటమి

ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 214 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని 38.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో అలిస్సా హీలీ(50), బెత్ మూనీ(76) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. కాగా, రెండో వన్డే ఈనెల 27న జరగనుంది.

February 24, 2026 / 04:00 PM IST

భారత్‌తో మ్యాచ్‌కు రెడీ: జింబాబ్వే కోచ్

చెన్నై వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ కోసం తాము సిద్ధంగా ఉన్నామని జింబాబ్వే కోచ్ జస్టిన్ సామన్స్ తెలిపాడు. వెస్టిండీస్ తమపై ఆడినట్లే, భారత్ కూడా ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతుందని తమకు తెలుసని కోచ్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పాడు. తమ పేసర్ ముజారబానీని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు.

February 24, 2026 / 03:48 PM IST

క్రికెట్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఇటలీ మహిళా క్రికెట్ జట్టు కోఆర్డినేటర్ ప్రభాత్ ఏక్నెలిగోడ (57)పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా క్రీడాకారిణిని, శిక్షణ సమయంలో మోకాలి గాయానికి మసాజ్ చేస్తున్న నెపంతో ఆయన అసభ్యంగా తాకినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మార్చి 2025లో రోమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు 2026 T20 WCలో ఇటలీ అరంగేట్రం చేయడంతో ఈ వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది.

February 24, 2026 / 03:33 PM IST

జట్టులో ఈ మార్పులు చేయాలి: పఠాన్

జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నాడు. అలాగే, అక్షర్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరాడు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపాడు.

February 24, 2026 / 02:58 PM IST

T20 WC: మరోసారి భారత్-పాక్ మ్యాచ్

ICC ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జూలై 5న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది.

February 24, 2026 / 02:45 PM IST

భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 215.

February 24, 2026 / 01:06 PM IST

T20 ప్రపంచకప్: భారత్ సెమీస్ చేరాలంటే..?

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచులో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలి. అప్పుడు రన్ రేటుతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

February 24, 2026 / 12:04 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్రిస్బేన్ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్లు మొదటి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత హర్మన్ సేన తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. 1983/84 మొదలు ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 11 వన్డే సిరీస్‌లు జరగ్గా.. భారత్ ఒక్కటి కూడా గెలవలేదు.

February 24, 2026 / 09:27 AM IST

నేటి నుంచి రంజీ ఫైనల్.. కర్ణాటక Vs జమ్మూ

ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్‌లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్‌, స్మరణ్‌ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్‌ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా చూడాలి.

February 24, 2026 / 09:12 AM IST

T20 WC: పాకిస్తాన్ జ‌ట్టుకు చావో రేవో

టీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో గెలిస్తే పాక్ మొదటి స్థానానికి వెళ్తుంది. ఓడితే, పాయింట్ల పట్టికలో మరింత దిగజారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బరిలో ఉంటాయి. అందుకే ఇవాళ్టి మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది. కాస్త అజాగ్రత్తగా ఆడినా.. మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లిపోతుంది.

February 24, 2026 / 07:50 AM IST

T20 WC: చిత్తుగా ఓడిన జింబాబ్వే

విండీస్‌తో T20 WC సూపర్ 8 మ్యాచులో జింబాబ్వే 107 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు 254/6 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో జింబాబ్వే 147 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో గూడకేష్ 4, అకీల్ 3, ఫోర్ట్ 2 వికెట్లు పడగొట్టారు. అనూహ్యంగా సూపర్-8కు చేరిన జింబాబ్వేకి ప్రస్తుత టోర్నీలో ఇదే తొలి ఓటమి. మరోవైపు కరేబియన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది.

February 23, 2026 / 10:48 PM IST