Rohit Sharma: ఆకాశ్ అంబానీ కార్లో రోహిత్ శర్మ .. వీడియో వైరల్!
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రైడ్‌కు వెళ్లాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇద్దరు కలిసి రైడ్‌కు వెళ్లడంతో ముంబై టీమ్‌లో ఏదైనా మార్పు జరుగబోతుందా అని చర్చ నడుస్తుంది.
Akash Ambani's car ride Rohit Sharma .. Video viral!
Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీతో ఆయన కార్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రైడ్‌కు వెళ్లాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం బయట రోహిత్‌ను ఆకాశ్ తన లగ్జరీ కారులో తీసుకెళ్లున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ రోజు గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై జట్టు పోటీ పడడున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి కార్లో వాంఖడే స్టేడియం దగ్గర కనిపించడంతో తీవ్ర చర్చసాగుతుంది. ఎందుకంటే ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయి, చివరి ఆట గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య మీద నెగిటివిటీ వస్తోంది.
గత ఏడాది వరకు జట్టును నడిపించిన రోహిత్ శర్మ ఐదు సార్లు విజయాన్ని ముంబైకి అందించారు. లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ మంచి ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో ఈ ఏడాది రోహిత్‌ను తొలగించి ఆయన స్థానంలో గుజరాత్ టీమ్ ప్లేయర్ అయినా పాండ్యను తీసుకొచ్చి కెప్టెన్ చేశారు. దీంతో హట్ అయిన హిట్‌మ్యాన్ అభిమానులు ముంబైపై ఆగ్రంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌తో రోహిత్ దర్శనం ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందో అని చర్చ కొనసాగుతుంది. ఇక ఈ సీజన్లో రోహిత్ సైతం పెద్దగా ప్రదర్శన కనబరచకపోవడం కూడా ఆయన ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది.