ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే జట్టులో సంజూ శాంసన్, చాహల్, భువనేశ్వర్ వంటివారికి చోటివ్వకపోవడం పట్ల పలువురు క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో నిన్న భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆస్ట్రేలియన్ కెప్టెన్, పాట్ కమ్మిన్స్ మిచెల్ మార్ష్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ind Vs Aus ప్రపంచ కప్ 2023 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ODI ప్రపంచ కప్ ట్రోఫీని గెల్చుకుంది. ఈ నేపథ్యంలో అనేక మంది భారత అభిమానులు భారత ఆటాగళ్ల ఆటతీరుపై విమర్శళు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇండియా బ్యాంటిగ్ తీరును మెచ్చుకుంటున్నారు.
వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే సమయంలో కింగ్ కోహ్లీ వద్దకు పాలస్తీనా మద్దతుదారుడు దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేడియం సిబ్బంది వచ్చి అతనిని బయటకు తీసుకెళ్లారు.
వన్డే వరల్డ్ కప్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల మోత కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది. ప్రపంచ క్రికెట్ కప్ గెలుపొందిన జట్టుకు రూ.33 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 16.64 కోట్ల రూపాయల బహుమతిని అందజేయనున్నారు.
2023 ప్రపంచకప్ (World Cup 2023 Final) అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. ఒక్క మ్యాచ్ ఓడకుండా, ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తూ ఫైనల్ చేరిన భారత్ (Team India) ఓవైపు.. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించినా, తర్వాత బలంగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆస్ట్రేలియా (Australia) ఇంకోవైపు. మూడోసారి ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని వదులకోకూడదని టిమిండియా పట్టుదలతో ఉంది.
వరల్డ్ కప్ కోసం రెండేళ్ల కింద నుంచి సన్నాహాలు చేస్తున్నానని రోహిత్ శర్మ మీడియాతో చెప్పారు. జట్టు విజయానికి కారణం కోచ్ ద్రావిడ్ అని.. అతను ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. ప్రోత్సహిస్తాడని తెలిపారు.
ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ధాటిగా ఆడటానికి కారణం విరాట్ కోహ్లీ అని సీనియర్ పేసర్ ఆశిష్ నేహ్రా తెలిపారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ నాణేనికి రెండు వైపుల వంటివారని వివరించారు.