»Ranji Trophy Ranji Trophy Players Not Getting Proper Salaries
Ranji Trophy: రంజీ ట్రోపీ ఆడే ఆటగాళ్లకు సరైన జీతాలు అందడం లేదా?
మన దేశంలో రంజీ ట్రోపీ ఆడే ఆటగాళ్లకు సరైన జీతాలు అందడం లేదా? చాలా కాలంగా వారికి ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదా? ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
Ranji Trophy: భారత దేశ క్రికెట్ వ్యవహారాలను తన గుప్పిట్లో ఉంచుకున్న బీసీసీఐ అనేక అవకతవకలను పాల్పడుతోంది. ఇష్టారీతిన ప్రవర్తిస్తోంది. అడ్డు అదుపూ లేకపోవడంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లలో కొందరికి మాత్రమే ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మన రంజీ ప్లేయర్లకు ఆర్ధికంగా భరోసా కల్పించలేకపోయింది. ఈ అంశాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ లేవెనెత్తాడు. బీసీసీఐ వ్యవహారశైలిని తప్పుబట్టాడు. రంజీ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని.. వారిని ఆర్ధికంగా ఆదుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి మూడింతలు పెంచాలని సన్నీ సూచించాడు.
ఇటీవల కాలంలో టెస్టు క్రికెటర్లకు మేలు చేసే విధంగా బీసీసీఐ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యాన్ని గుర్తుచేస్తూ సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కొన్ని సూచనలు చేశారు. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లలో రంజీ ప్లేయర్లే ఎక్కువుగా ఉంటున్నారు. టెస్టు జట్టులో స్థానం సంపాదించే రంజీ ప్లేయర్లు మరింత మెరుగైన వారు రావాలంటే.. వారికి ప్రస్తుతం ఇస్తున్న మొత్తం కంటే రెండు మూడింతలు ఎక్కువుగా ఇవ్వాలని గవాస్కర్ సూచించాడు. సరైన ఆర్ధిక భరోసా లేనికారణంగానే చాలా మంది మెరుగైన ఆటగాళ్లు రంజీ ఆడడం మానేశారని సన్నీ గుర్తుచేశాడు.
రంజీ టోర్నీల షెడ్యూల్ విషయంలోనూ బీసీసీఐ జాగ్రత్తలు పాటించాలని గవాస్కర్ బీసీసీఐకి సూచించాడు. ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభిస్తేనే.. వారు మరింత మెరుగ్గా రాణిస్తారని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రయాణ సమయంలో అలసట నుంచి తేరుకోవాలన్నా, ఫిజియో సేవలు వినియోగించుకోవాలన్నా.. మ్యాచ్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలని గవాస్కర్ సూచించాడు.