»Dont Call Him King Kohli Call Me Virat Says Kohli
Virat Kohli: అలా పిలిస్తే కొహ్లీకి నచ్చదట.. ఇబ్బందిగా ఉంటుందట
విరాట్ కోహ్లీతో సహా ఆర్సీబీ టీమ్ గత రాత్రి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లి యాంకర్‌పై, తన అభిమానులపై చిరుకోపం ప్రదర్శించారు. వారికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Don't call him King Kohli. Call me Virat, says Kohli
Virat Kohli: క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న సీజన్ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్-2024(IPL2024) మొదలు కాబోతుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీతో సహా ఆర్సీబీ(RCB) టీమ్ బెంగళూరు చేరుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి ఆర్సీబీ అన్బాక్సింగ్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కాగా నిర్వహకులు, కోహ్లీ ఫ్యాన్స్ కింగ్(KING) కోహ్లీ, కింగ్ కోహ్లీ అని అరిచారు. దీనిపై కోహ్లీ(Kohli) స్పందించారు. “ప్లీజ్.. మీరు కింగ్ కోహ్లీ అని పిలవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు అలా పిలవడం ఆపండి.. విరాట్ చాలు. ఇదే విషయం డుప్లేసిస్తో చర్చించాను. కింగ్ అని పిలిప్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఇప్పటి నుంచి ఆ పదాన్ని ఉపయోగించకండి. కేవలం విరాట్ అని పిలిస్తే చాలు” అని కోహ్లీ తెలిపాడు.
విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ టోర్నీ మొదటి సీజన్ (2008) నుంచి ఆడుతున్నాడు. అప్పటి నుంచి ఆయన అభిమానులు కింగ్ కోహ్లీ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఇదే కార్యక్రమంలో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ మహిళా జట్టును బెంగళూరు యాజమాన్యం సత్కరించింది. ఆర్సీబీ కలను సాకారం చేసిని వుమెన్స్ జట్టు సాధించిన విజయం గురించి కోహ్లీ మాట్లాడాడు. ఆర్సీబీ మహిళలు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం. ఈసారి ఐపీఎల్లో మేము కూడా విజయం సాధించి ట్రోఫీలను డబుల్ చేస్తే, అది కచ్చితంగా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.