ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి పరియచం అక్కర్లేదు. తన ఆటతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే 2022లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ ధరించిన జెర్సీ వేలం వేయగా కోట్లు పలికింది.
టీమిండియా మహిళల జట్టు రికార్డు నెలకొల్పింది. 88 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచులో 410 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. 1935లో ఇంగ్లాండ్ జట్టు 431 పరుగులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు భారత మహిళల జట్టు చేరింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా జీర్ణించుకోలేదని పేర్కొన్నారు. కప్ కోసం ఎంతో కష్టపడి ఆడామని తెలిపారు. చివరి మ్యాచ్‌లో కలిసి రాలేదని, ఓటమిని తట్టుకోవడం అంత సులువు కాదని వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడడానకే యూకే వెళ్లినట్లు తెలిపారు. అండగా ఉన్న అభిమానలకు ధన్యవాదాలు చెప్పారు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చికెన్ తింటున్నారని అభిమానులు షాక్ అవుతున్నారు. చాలా కాలం క్రితమే శాఖహారిగా మారాడు. ప్రస్తుతం ఆయన పెట్టిన మాక్ చికెన్ టిక్కా పోస్ట్ వైరల్ అయింది. అసలు విషయం తెలియక విరాట్ పోస్ట్ చూసి కొందరు షాక్ అవుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. వర్షం ప్రభావంతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెల్చింది.
క్రికెట్ లోకంలో విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' తన మొత్తం 25 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా శోధించిన జాబితాను విడుదల చేసి కీలక విషయం తెలిపింది. క్రికెటర్ల విషయానికి వస్తే కోహ్లీ పేరు అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది.
IPL 2024 మినీ వేలం మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. అయితే అందుకోసం ఇప్పటికే బీసీసీఐ మొదటి సెట్‌లో మొత్తం కేవలం 333 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసింది. వీటిలో నుంచి 77 మందిని ఎంపిక చేయనున్నారు.
భారత్, దక్షిణాఫికా టీ20 మ్యాచ్ ఈ రోజు దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో నెగ్గిన భారత్.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా జట్టును కూడా ఓడించడానికి రెడీగా ఉంది.
ప్రో కబడ్డీ పదో సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సీజన్‌లో 5వ మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ 9వ సీజన్ విజేత పుణేరి పల్టాన్ మధ్య జరిగింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
ప్రముఖ మ్యాగజైన్ డిసెంబర్ నెలకు ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన 'ఛేంజర్ మేకర్స్-2023' జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.