ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై ఒక్కటే చర్చ.. ఈ క్రమంలో తన తప్పు ఏం లేదని మాథ్యూస్ అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశాడు.
శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 279 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 282 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి శ్రీలంక బ్యాటర్ 'టైమ్డ్ ఔట్' నిబంధన ప్రకారం ఔట్ అయ్యాడు. సమయానికి క్రీజులోకి వచ్చి ఆటను ఆడటంతో విఫలం కావడం వల్ల అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో ఇలాంటి ఔట్ మొదటిసారి నమోదు అయ్యింది.
సఫారీలతో విజయం వెనక కచ్చితంగా బౌలర్ల కృషి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. విరాట్ కోహ్లీ నుంచి మరిన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ రావాల్సి ఉందన్నారు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజయాన్ని పొందింది. దక్షిణాఫ్రికా జట్టును 83 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(yuva raj singh), మాజీ కెప్టెన్ MS ధోనీతో తనకున్న సంబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనేక సంవత్సరాలుగా భారత జట్టులో కలిసి ఉన్న క్షణాలను పంచుకున్నప్పటికీ మహీ మాత్రం ఎప్పుడూ సన్నిహిత మిత్రుడు కాదని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును సమం చేసినట్లైంది.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీ బర్త్ డే రోజు అనుష్క వర్మ స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే ఓ భావోద్వేగపు నోట్‌ను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క శర్మ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి నేటితో 35 ఏళ్లు. ఈ వయసులోనే అనేక రికార్డులను అధిగమించాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం బీట్ చేశాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తన గురించి పలు కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠతో కూడిన మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. అంతేకాదు ఈరోజు విరాట్ కోహ్లీ పుట్టినరోజు అయిన నేపథ్యంలో కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్‌లో మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్
వర్షం కారణంగా బెంగళూరులో జరిగిన న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచులో అనుహ్యాంగా డీఎల్ఎస్ పద్ధతిలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 401 పరుగులు చేసినప్పటికీ చివరకి ఇలా జరగడం పట్ల కివీస్ అభిమానులు నిరాశ చెందారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో నేడు న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర(Rachin Ravindra) సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 35వ మ్యాచులో ఈ ఘనతను సాధించాడు. అయితే అతని వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.