పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి.. పాక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
Shoaib Malik: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాలిక్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపాడు. తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. జంటగా మేము ఇలా అంటూ హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేశారు. అయితే భారత టెన్నిస్ స్టార్ సానిమా మీర్జాను షోయబ్ మాలిక్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2010లో వీరి వివాహం కాగా 2018లో ఒక కుమారుడికి జన్మనిచ్చారు. అయితే షోయబ్ సానియా కంటే ముందు అయేషా సిద్ధిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను వివాహం చేసుకున్నాడు.
షోయబ్, సానియా మధ్య గత కొంతకాలంగా విబేధాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. అయితే విడాకులు పక్రియ పూర్తయినట్లు సానియా కానీ షోయబ్ ఎవరూ వెల్లడించలేదు. ఇంతలోనే షోయబ్ సనాని వివాహం చేసుకున్నారు. అలాగే సనా జావేద్‌తో షోయబ్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. సనా ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను ఈమె పెళ్లాడింది. తర్వాత కొంతకాలానికి అతనితో బంధాన్ని తెంచుకుంది. ఈక్రమంలో షోయబ్ పరిచయం కావడం, పెళ్లి జరిగాయి.