నేడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 33వ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు మిస్సయ్యాయి. అయితే ముందుగా శుభ్‌మాన్ గిల్ తన ఏడో వన్డే సెంచరీ చేసేందుకు ముందు 92 రన్స్ వద్ద ఔట్ కాగా..సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. గిల్, కోహ్లి, అయ్యర్ హాఫ్ సెంచరీలు చేసి అలరించారు.
ఈరోజు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ ఛేజ్ చేస్తాడని అనుకుంటే..అది పూర్తి కాకుండానే ఔట్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన ఇన్నింగ్స్‌లో టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును విరాట్ సమం చేయాలని అభిమానులు ఆత్రుతగా చూడగా అది ఈరోజు సఫలం కాలేదు.
వరల్డ్ కప్‌లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.
వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగగా..సౌతాఫ్రికా జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 357 రన్స్ చేయగా..ఇక తర్వాత చేధనకు దిగిన న్యూజిలాండ్ పూర్తి చేయకుండానే 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత్- శ్రీలంక మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరిగే స్టేడియం తనకెంతో ప్రత్యేకం అంటున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
వాంఖడే స్టేడియంలో నేడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం భారత్, శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి బీసీసీఐ సభ్యులతో పాటుగా సచిన్ కూడా హాజరుకానున్నారు.
పాకిస్థాన్ కిక్రెటర్ షోయబ్ మాలిక్ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. ఇండియన్ టీమ్ గెలవాలంటే అతని సూచనలు తప్పనిసరిగా ఉండాలని ఓ ఇంటర్వూలో తెలిపాడు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఆమె కొన్ని వారాల పాటు ఆటకు దూరం కానుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననుంది.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయ్యింది. ఈ రేస్‌ను చెన్నైకి మారుస్తున్నట్లుగా రేసింగ్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు.
వన్డే వరల్డ్ కప్‌లో నేడు బంగ్లాదేశ్‌పై పాక్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ విజయాన్ని పొందింది. మూడు వికెట్లకు లక్ష్యాన్ని ఛేదించడంతో నెట్ రన్ రేట్‌ను పాక్ జట్టు పెంచుకుంది. బాబర్ సేనకు విజయం దక్కడంతో పాక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రోజు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా మొదట్లో మూడు కీలక వికెట్లు పడడంతో నెమ్మదించింది. ఇక మొత్తానికి 204 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్లో జరగబోయే భారత్-దక్షిణ ఆఫ్రికా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని పాక్ క్రికెటర్ మహ్మాద్ రిజ్వాన్ అన్నాడు. నవంబర్ 5 విరాట్ బర్త్‌డే మరింత ప్రత్యేకం కావాలని కోరుకున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం 70 వేల కోహ్లీ ఫేస్ మాస్క్‌లను రెడీ చేస్తోంది.
నేటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఆఫ్ఘన్ జట్టు ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
2023 వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెట్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.