Yashaswi Jaishwal scored a double century.. a rare record in Test
Yashaswi Jaishwal: భారత క్రికెట్ జట్టు యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) డబుల్ సెంచరీ(double century) సాధించాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడుతున్న భారత్(ENG vs IND) రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 209 పరుగులు చేశాడు. 179 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన యశస్వి భారీ షాట్స్‌తో బౌండ్రీలు సాధిస్తూ, బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 277 బంతుల్లో 209 పరుగులు చేశాడు. అండర్సన్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 7 సిక్సులతో మొత్తం 209 పరుగులు సాధించాడు.
తొలి డబుల్ సెంచరీ చేసిన యశస్వి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారతీయ ఆటగాడిగా స్థానం దక్కించుకున్నాడు. వినోద్ కాంబ్లి, సునిల్ గవాస్కర్ తరువాత స్థానంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఎడమ చేతి వాటం కలిగిన యశస్వి తక్కువ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ చేశాడు.