IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ మెగా టోర్నీని మార్చి 22న ప్రారంభించేందుకు బీసీసీఐ తేదీని ఖరారు చేసింది. 17వ సీజన్ తేదీలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉండగా మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఎన్నికల తేదీల తర్వాతే ఐపీఎల్ టోర్నీ తేదీలను ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో విదేశాల్లో ఐపీఎల్ జరగనుందనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. అయితే టోర్నీని భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. పురుషుల ఐపీఎల్ 17వ సీజన్ తర్వాత ఈసారి మహిళల ప్రీమియర్ లీగ్ 2024 రెండో సీజన్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం WPL 2024 ఫిబ్రవరి 22న ప్రారంభమై మార్చి 17న ముగుస్తుంది. మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్ 1న వెస్టిండీస్, అమెరికా మధ్య టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.