Mohammed Shami: భారత పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పెళ్లి గెటప్‌లో దర్శనం ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. షమీ తన భార్య హసీన్ జహాన్‌తో మనస్పర్థలు వచ్చి విడాకుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. వీరి విడాకుల కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో షమీ పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతోంది. తానే స్వయంగా ఈ ఫోటోను షేర్ చేశారు. మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీని వెనుకు కారణం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దాంతో తన ఫ్యాన్స్ ప్రశ్నలు వర్షం కురిపించారు. షమీ మీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఈ గెటప్‌లో చాలా బాగున్నారు అని పలువురు కామెంట్లు పెట్టారు. దీనిపై షమీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇక షమీ ఫామ్ గురించి తెలిసిందే. 2023 ప్రపంచ వన్డే వరల్డ్ కప్‌లో తన విశ్వరూపం చూపించాడు. అత్యధిక వికెట్లు తీసి తన సత్తా చాటాడు. తరువాత తన కాలు మడిమకు గాయం వల్ల ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో షమీ ప్రదర్శనకు దేశంలోనే రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ వరించింది. త్వరలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్విహించుకొని టీమ్‌లో వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.