Ram Mandir: రామమందిరానికి 400 కిిలోల భారీ తాళం.. వీడియో వైరల్
రామ మందిరం కోసం భక్తులు బహుబలి తాళాన్ని తయారు చేశారు. దాని బరువు ఏకంగా 400 కేజీలు ఉంది. దాన్ని ప్రత్యేక వాహనంలో తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Ram Mandir: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో అనేక అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా 400 కేజీల తాళం కూడా ఉంది. ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యాక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతున్న ఈ వేడుక కన్నుల పండుగగా జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 20న కానుకల సమర్పణ క్రతువు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అయోధ్యకు దేశం నలుమూలల నుంచి కానుకలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన రామ భక్తులు అయోధ్య రామ మందిరానికి ఓ బాహుబలి తాళంను కానుకగా తీసుకొచ్చారు.
ఈ తాళం బరువు 400 కిలోలు. దీని తాళం చెవి కూడా దాదాపు దాని సైజ్‌కు తగ్గట్టుగానే ఉంది. ఎంతో నేపుణ్యంతో దాదాపు ఆరునెలలు కష్టపడ్డారని తెలుస్తుంది. రాముల వారికి దీన్ని సమర్పించడానికి భారీ ట్రక్‌లో తీసుకొచ్చారు. ఆ తరువాత క్రైన్ సాయంతో దాన్ని మందిర నిర్వాహకులకు అప్పజెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.