»Controversy Over Kohlis Out Is That No Ball What Is The Point
Virat Kohli: కోహ్లీ ఔట్‌పై వివాదం.. అసలు విషయం ఏంటంటే?
ఇటీవల జరిగిన ఆర్సీబీ, కొలకతా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు సోషల్ మీడియాలో వివాదస్పదమైంది. అది ఔట్ కాదంటూ కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది నో బాలా కాదా అనేది చూద్దాం.
Controversy over Kohli's out.. Is that no ball?. What is the point?
Virat Kohli: ఐపీఎల్ సీజన్ 17 రసవత్తరంగా సాగుతుంది. చివరి బంతి వరకు గెలుపు ఎవరిదో తేల్చడం అసాధ్యంగా మారింది. అలాంటి సమయంలో టీమ్‌లోని కీలక ప్లేయర్, అదీ మంచి దూకుడు మీదున్న సమయంలో ఎంపైర్ల తప్పుడు నిర్ణయంతో వెనుదిరిగితే అభిమానుల ఆగ్రహం ఎలా ఉంటుంది. దారుణంగా ఉంటుంది. ఇటీవల కోల్‌కతాతో ఆర్సీబీ ఆడిన ఆటలో గ్రీజ్‌లో విరాట్ కోహ్లీ ఆ విధంగానే ఔట్ అయ్యాడు అని ఆయన ఆభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. కోహ్లీ నాట్ ఔట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సాంకేతికంగా ఎంపైర్ల తప్పే అని విరుచుక పడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 223 లక్ష్య ఛేదనలో భాగంగా గ్రీజ్‌లో దిగిన విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. అప్పటికే రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో 7 బంతుల్లో 18 వ్యక్తిగత స్కోర్ చేశారు. 2.1 ఓవర్ దగ్గర హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతిని ఆడి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఫీల్డ్ ఎంపైర్ ఔట్ ఇచ్చారు.
బంతి నడుము కన్న ఎత్తులో వచ్చింది. దాన్ని నో బాల్‌గా ప్రకటించాలని కోహ్లీ రివ్యూ కోరాడు. థర్డ్ ఎంపైర్ సైతం కోహ్లీని ఔట్‌గా పరిగణించడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు. అయితే బంతి నడుము కన్నా ఎత్తులో వచ్చినప్పుడు అది నో బాల్ అనే అంటారు. కానీ ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉండాలి. కానీ కోహ్లీ క్రీజ్ బయట ఆడుతున్నాడు. అందుకనే ఆ బాల్ లీగల్ డెలివరీగా పరగణించి థర్డ్ ఎంపైర్ ఔట్ ఇచ్చారు. విరాట్ నడుము 1.04 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఆయన క్రీజ్‌లో ఉంటే బంతి 0.92 మీటర్ల ఎత్తులో బ్యాట్స్‌మెన్ దగ్గరకు వచ్చేది. అలాంటప్పుడు దాన్ని నోబాల్‌గా ప్రకటించలేరు. ఐసీసీ నియమావళి 41.7 రూల్ ప్రకారం అది నో బాల్ కాదు అని నిర్ధారించారు.