»Kashmiri Athlete Bilkis Mir Became The First Indian Olympic Jury Member
Bilkis Mir: తొలి భారత ఒలింపిక్ జ్యూరీ సభ్యురాలిగా బిల్కిస్ మిర్
కశ్మీర్ క్రీడాకారిణి బిల్కిస్ మిర్ త్వరలో జరగబోయే ఒలంపిక్ క్రీడాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన బిల్కిస్ మిర్ క్రీడా ప్రస్థానం తెలుసుకుందా.
Kashmiri athlete Bilkis Mir became the first Indian Olympic jury member
Bilkis Mir: బిల్కిస్ మిర్ కశ్మీర్‌కు చెందిన క్రీడాకారణి. త్వరలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. సభ్యురాలిగా ఎంపికైన తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. వాటర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్, ఆక్వా మహిళగా ఆమె గుర్తింపు ఉంది. దాదాపు 30 ఏళ్లపాటు ఆమెది సుదీర్ఘ క్రీడా ప్రయాణం. శ్రీనగర్‌లోని దాల్ సరసుల్లో ఆమె ప్రాక్టీస్ చేసేది. కెనూయింగ్, కయాకింగ్ క్రీడల్లో అనేక మైలురాళ్లు పూర్తి చేసుకొని ఎన్నో రికార్డులను నెలకొల్పారు. బిల్కిస్ మిర్ ఒలంపిక్ జ్యూరి సభ్యురాలిగా ఎంపికైన విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ ఇటీవలే ప్రకటించింది.
ఈ విషయంపై బిల్కిస్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల అని హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడం తనకు గర్వకారణమని తెలిపారు. గతంలో ఆమె కెనూయింగ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. జాతీయ మహిళా జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. చైనాలోని హాంగ్జోలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఒకేఒక భారత మహిళా జ్యూరీ సభ్యురాలిగా ఆమె పాల్గొనడవ విశేషం. క్రీడాప్రపంచంలో అనేక శిఖరాలు అధిరోహించిన బిల్కిస్..యువక్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేకంగా ఉన్న జలవనరుల కారణంగా అక్కడి యువత వాటర్ స్పోర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని అందుకే తాను వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది. కోచ్‌గా వ్యవహరిస్తుంది.