Somali Athlete's Worst Performance In 100-Metre "Sprint"
Somalia: సోమాలియాకు (Somalia) చెందిన అథ్లెట్ నస్ర అబుకర్ అలీ (Nasra Abukar Ali) చెత్త ప్రదర్శన ఇచ్చారు. 100 మీటర్ల పరుగు పందెంలో రన్ కాదు కదా నడిచారు. మిగతా అథ్లెట్లు అందరూ 11 సెకన్లలో లక్ష్యం చేరితే.. ఈ మేడమ్ తాపీగా 21 సెకన్లలో టార్గెట్ రీచ్ అయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు.
చైనాలో చెంగ్దు 31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ జరుగుతున్నాయి. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో పలు దేశాలు పాల్గొన్నాయి. సోమాలియా నుంచి నస్ర అబుకర్ అలీ (Nasra Abukar Ali) పాల్గొన్నారు. ఈమె సోమాలియా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కోడలు అట.. అందుకే ఆమెను ఎంపిక చేసినట్టు ఉన్నారు. నస్ర మాత్రం ఫిట్‌గా లేరు. ఆ వీడియోలో చూస్తే అర్థం అవుతోంది. 100 మీటర్ల పరుగు పందెంలో మిల్లీ సెకన్ కూడా ఇంపార్టెంట్.. ఆమె ఏకంగా 10 సెకన్లు లేటుగా వచ్చారు.
నస్రను (Nasra) ఈవెంట్స్‌కు పంపించి ఏ సందేశం ఇస్తున్నారని సోమాలియా అథ్లెటిక్స్ ఫెడరేషన్‌ను నెటిజ్లను ప్రశ్నిస్తున్నారు. దేశంలో మంచి అథ్లెట్స్ లేరా..? క్రీడల్లో కూడా రాజకీయాలు అవసరమా..? అంటూ దుమ్మెత్తి పోశారు. ఆ వీడియో చూసిన వెంటనే తనకు నవ్వు ఆగలేదని మరో యూజర్ రాసుకొచ్చారు. తన జీవితంలో అంతకన్నా ఎక్కువగా నడవలేదెమో అని సెటైర్స్ వేశారు. సోమాలియాలో మారథాన్ రన్నర్స్ ఉన్నారు.. తప్పేం చెప్పడం లేదు కదా అని మరొకరు ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు.
The Ministry of Youth and Sports should step down. It's disheartening to witness such an incompetent government. How could they select an untrained girl to represent Somalia in running? It's truly shocking and reflects poorly on our country internationally. pic.twitter.com/vMkBUA5JSL
ఇప్పుడే కాదు.. ఆమె జీవితంలో ఎప్పుడూ పరుగెత్తలేదు అని మరొకరు రాశారు. నస్ర (Nasra) చెత్త ప్రదర్శన గురించి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మిగతా మంచి ప్లేయర్లను వదిలి.. ఆమెను ఎంపిక చేసి దేశం పరువు తీశారని ధ్వజమెత్తారు.