మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ స్మృతి మంధాన 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అద్భుతమైన అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ 40 పరుగులతో క్రీజులో ఉంది. ప్రస్తుతం భారత్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు పూర్తి చేసుకుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నవీ ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గెలిచిన జట్టు సెమీస్‌కు చేరనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పడుతుంది. దీంతో గెలుపుకోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 73 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు(11,249) చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గంగూలీ(11,2210)ని అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్(18,426), కోహ్లీ(14,181) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 40.2 ఓవర్లకు భారత్ ప్రస్తుత స్కోర్ 200గా ఉంది. అక్షర్ పటేల్(31*), సుందర్(10*) క్రీజులో ఉన్నారు. కోహ్లీ 0, గిల్ 9, రోహిత్‌శర్మ 73, శ్రేయస్ అయ్యర్ 61, KL రాహుల్ 11 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో గ్జేవియర్, జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ ఒక వికెట్ సాధించాడు.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో తన 59వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత్ ప్రస్తుతం 27 ఓవర్లకు 117/2 పరుగులు చేసింది. రోహిత్(63*), శ్రేయస్ అయ్యర్(43*) క్రీజులో ఉన్నారు. కోహ్లి 0 , గిల్ 9 పరుగులు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్జేవియర్ 2 వికెట్లు తీశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఆసీస్‌తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత కోహ్లీ(9802), సచిన్ (9740) ఉన్నారు. కాగా, రోహిత్ ఇప్పటి వరకు 275 వన్డేల్లో 11,184* పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాతో తలపడుతున్న మ్యాచ్ కోసం టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. భారత్ జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కోహ్లీ, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్. ఈ బలమైన జట్టుతో భారత్ విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(AUS) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలవడంతో ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది.
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ జరిగే లీగ్ ఆఖరి మ్యాచులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ ముంబై వేదికగా మ.3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పడుతుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన 57 మ్యాచుల్లో 22- 34 తేడాతో భారత్‌పై న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది.
ఆస్ట్రేలియా టూర్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా ఇవాళ రెండో ODI ఆడనుంది. 3 ODIల సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచులో భారత్ గెలవాల్సిందే. లేదంటే సిరీస్ ఆసీస్ సొంతమవుతుంది. ఇక తొలి మ్యాచులో నిరాశపరిచిన RO-KO జోడీ ఈ మ్యాచులో రాణించాలని చూస్తోంది. ఉ.9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, JioHotstarలో లైవ్ చూడొచ్చు.
WWC మ్యాచులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ENGw 244 రన్స్ చేయగా.. AUSw 40.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున గార్డ్‌నర్ 104& 2 వికెట్లు, సదర్లాండ్ 98& 3 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో WWC లీగ్ దశను అజేయంగా ముగించగా.. ENGwకు ఇదే తొలి ఓటమి.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు న్యూజిలాండ్‌తో మహిళల భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే హర్మన్‌సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి.భారత తుది జట్టు(అంచనా):స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, అమన్‌జోత్, స్నేహ్ రాణా, దీప్తి, రేణుక సింగ్/జెమీమా, క్రాంతి, శ్రీ చరణి.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ట్యామీ బేమౌంట్(78) పరుగులతో రాణించింది. అలైస్ క్యాప్సీ(38), ఛార్లోట్ డీన్(26) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ 3, సోఫీ 2, ఆష్లే 2, అలానా కింగ్ 1 వికెట్ పడగొట్టారు.