న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడెన్ చేశాడు. అలాగే, ఈ WCలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్ పాండ్యా, శ్రీలంకతో మ్యాచ్‌లో హెన్రీ(NZ) కూడా తమ తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా వేశారు. అయితే, ఈ మూడు మెయిడెన్ ఓవర్లు కూడా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనే రావడం గమనార్హం.
రంజీ ఫైనల్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ 477 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది. JK తొలి ఇన్నింగ్స్‌లో 584, ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 186/4 పరుగులు చేసింది. రేపు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా జమ్మూకశ్మీర్ విజేతగా నిలవడం ఖాయం.
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. నబీ భారత జెర్సీ ధరించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు గంగూలీ సూచించాడు. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలో నబీని టీమిండియా జెర్సీలో చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
జింబాబ్వేతో మ్యాచ్‌లో శివమ్ దూబే కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. దూబే బౌలర్‌గా ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అతడితో బౌలింగ్ చేయించే ముందు జట్టు విజయావకాశాల గురించి ఆలోచించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ ఈ మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం తనను తీవ్రంగా ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అభిషేక్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో అందరికీ తెలిసిందేనని.. కానీ ఈ మ్యాచ్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆడాడని పేర్కొన్నాడు. ఇకపై ఇదే శైలిలో ఆడాలని అతడికి సూచించాడు.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 17 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు టై అయ్యాయి. అలాగే, 7 ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ 4, న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లలో గెలిచాయి. మొత్తంగా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్ (101) సెంచరీతో అదరగొట్టగా, లిచ్‌ఫీల్డ్ (80) పరుగులతో రాణించింది. వరుసగా 2 విజయాలతో ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. జింబాబ్వేతో నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.. అర్ష్‌దీప్ 81 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. జింబాబ్వేపై విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ కూడా రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
రంజీ సీజన్‌లో జమ్మూకాశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీ దూసుకుపోతున్నాడు. ఈ రంజీ సీజన్‌లో నబీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపిచినట్లైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన తనను టీమిండియాకు ఎలా ఎంపిక చేయరో చూస్తా అన్నట్లుగా ఆడాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(52), హర్మన్ ప్రీత్(54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లు ఆష్లీ గార్డనర్, అలానా కింగ్, అన్నాబెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీస్ టార్గెట్: 252.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. కానీ, నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను’ అని అన్నాడు.
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు స్టార్ క్రికెటర్ అయినా.. రూ. కోట్లు సంపాదిస్తున్నా.. ఆయన మాత్రం గ్యాస్ సిలిండర్ మోస్తూ కష్టపడేవారు. పనులన్నీ వదిలి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇలా జరగడం బాధాకరం. కొన్ని రోజుల్లో రింకూకి పెళ్లి జరగనుండగా.. ఆ వివాహ వేడుక చూడకుండానే ఆయన కన్నుమూయడం అందరిని కలిచివేస్తోంది.
జింబాబ్వే బ్యాటర్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ వారి పర్ఫామెన్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పవర్ ప్లేలో కాస్త స్లోగా ఆడినా.. చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఇక వెస్టిండీస్ మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. ఒక రోజు రెస్ట్ తీసుకుని మ్యాచ్‌కు రెడీ అవుతాం’ అని పేర్కొన్నాడు.