పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. మను బాకర్ అరుదైన రికార్డు సృష్టించింది. స్వల్ప మార్జిన్ తో రజతం కోల్పోయిన, కాంస్య పతాకాన్ని గెలిచి దేశం గర్వించేలా చేసింది మను. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో మహిళా షూటర్ ఎవరూ పతాకాన్నిగెలవలేదు, మను బాకర్ ఆ ఘనతను సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లో మను పేలవ ప్రదర్శన వల్ల ఎనో అవమానాలు ఎదుర్కొంది, ఇప్పుడు పోయిన చోటే వెతుక్కుంది మను. ఏ ఒలింపిక్స్ లో అయితే అవమాన పడిందో, మల్లి అక్కడే పతాకం సాధించి దేశం గర్వపడేలా చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది
మను బాకర్ పై పలువురుప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ: ‘దేశం గర్వపడేలా చేసావు. నీ విజయం తెలిసినప్పటి నుంచి దేశం ఉప్పొంగుతుంది, టోక్యో లో పరికరం పాడవడం తో సాధించలేనిది ఈసారి ఏ ఒక్క అవకాశం వదులుకోలేదు. అప్పుడు ఎంత నష్టపోయావో, ఇప్పుడు అంతకంటే ఎక్కువే పొందావు’ అని కొనియాడారు. మోదీ ప్రశంసలకు, అథ్లెట్లకు ఇస్తున్న ప్రోత్సాహంపై మను ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు
సచిన్ టెండూల్కర్:
దేశం గర్వపడే విజయం, టోక్యో లో ఆవేదన దాటి ఇప్పుడు అద్భుత ప్రదర్శనతో, అంకితభావంతో మెడల్ గెలిచావు. దేశం గర్వపడేలా చేశావు
అభినవ్ బింద్రా:
కృషి, అంకితభావం, తపనకు దక్కిన ఫలితం ఇది., ప్రతీ షాట్ తో దేశం గర్వపడేలా చేశావు. నీ పట్టుదల, సంకల్పానికి ఈ ఘనతే నిదర్శనం
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మను బాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు