బాలీవుడ్ లో కలెక్షన్లు రాబట్టడం, రికార్డులు తిరగరాయడం కొత్తేమి కాదు. 70స్, 80స్ మొదలు ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్లు ఎన్నో ఘనతలు సాధించారు. తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ట్రెండ్ నడుస్తుంది. ఆయనబాక్ తో బ్యాక్ 1000 కోట్ల సినిమాలతో అల్ టైం హిట్లు సాధించాడు. కమర్షియల్ ఫార్మటు తో ఒకదానిని మించి మరొకటి అన్నట్టు కలెక్షన్లు రాబట్టాడు
ఇదే తరుణం బాలీవుడ్ లో హీరోలతో సమానంగా హీరోయిన్ దీపికా పదుకొనే కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. పఠాన్, జవాన్ సినిమాల్లో షారుఖ్ ఖాన్ సరసన నటించిన దీపికా ఆ రెండు సినిమాలతో 1000 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ప్రభాస్ తో నటించిన కల్కి సినిమాలో కూడా ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఏకంగా 3 వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులతో ఆమె రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫైటర్ కూడా మంచి హిట్ సాధించింది, బాలీవుడ్ లో 200 కోట్ల నెట్ క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లలో మరెవరికి ఇలా మూడు వెయ్యి కోట్ల సినిమాలు లేవు. ప్రస్తుతం దీపికా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింగం అగైన్ సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది దీపికా – రణవీర్ సింగ్ లు తల్లిదండ్రులు కాబోతున్నారు. మొత్తానికి ఆమెకు 2023- 2024 కెరీర్ పరంగా, పర్సనల్ గా గోల్డెన్ పీరియడ్ అనే చెప్పొచ్చు