• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

మ్యాచ్ గెలిచాం.. కానీ బౌలింగ్ బాలేదు: సూర్య

T20 WCలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మా లోపాలను సరిదిద్దుకుంటాం’ అని తెలిపాడు.

February 27, 2026 / 12:12 PM IST

రంజీ ట్రోఫీ ఫైనల్.. కర్ణాటక ఆలౌట్

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఇబ్బందుల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (86*) రాణించినప్పటికీ, జమ్మూ బౌలర్ల ధాటికి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 293 పరుగులకే కర్ణాటక ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటక జట్టు 291 పరుగుల వెనకంజలో ఉంది. కాగా, జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 11:48 AM IST

సంజూపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో బౌండరీలు కొట్టే క్రమంలో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ రిస్క్ తీసుకోకపోతే జట్టు స్కోరు వేగంగా పెరగదు. అందుకే ‘సంజూని నిందించలేం’ అని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ గ్యాప్స్‌ను వాడుకోవడమే అతని ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు.

February 27, 2026 / 11:32 AM IST

టీమిండియాపై సచిన్‌ ప్రశంసలు

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోనూ ఇదే రిథమ్ కొనసాగించాలని సూచించాడు. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా, అందరూ కలిసికట్టుగా రాణించారని అభినందించాడు.

February 27, 2026 / 11:12 AM IST

మా నాన్న వారిని శపించాడు: అర్ష్‌దీప్

చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నాడు. ‘సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌ను నా తండ్రితో కలిసి టీవీలో చూశాను. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ మా తండ్రి వారిపై అరిచాడు. వారిని శపించాడు’ అని తెలిపాడు.

February 27, 2026 / 10:54 AM IST

టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ నయా రికార్డ్

భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్‌లలోనే అర్ష‌దీప్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అర్షదీప్ క్రియేట్ చేయగా… అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు.

February 27, 2026 / 10:32 AM IST

టీమిండియాకు GOOD NEWS

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.

February 27, 2026 / 10:12 AM IST

INDW vs AUSW: తుది జట్లు ఇవే..!

భారత్, ఆసీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, షఫాలీ, హర్మన్‌ప్రీత్(C), జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, కష్వీ గౌతమ్, క్రాంతి, అమన్ జోత్, వైష్ణవి, శ్రీ చరణీఆసీస్ జట్టు: హీలీ(C), లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా, అలానా, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్, నికోలా కారీ.

February 27, 2026 / 09:31 AM IST

BREAKING: టాస్ గెలిచిన టీమిండియా

ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే ఓడిన నేపథ్యంలో.. సిరీస్‌ను కాపాడుకునేందుకు హర్మన్ సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.

February 27, 2026 / 09:18 AM IST

BREAKING: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం

భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.

February 27, 2026 / 07:49 AM IST

250+ స్కోర్.. జింబాబ్వే చెత్త రికార్డులు

T20 WC వేదికగా జింబాబ్వే చెత్త రికార్డులు మూటగట్టుకుంది. T20ల్లో 2 వరుస మ్యాచుల్లో 250+ రన్స్ సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. జింబాబ్వేపై 23న విండీస్ 254/6 స్కోర్ చేయగా.. రాత్రి భారత్ 256/4 చేసింది. ఈ రెండూ T20 WCలోనే టాప్-3 టీమ్ స్కోర్స్‌లో ఉండటం గమనార్హం. అలాగే ఓ T20 WC మ్యాచులో అత్యల్పంగా 26 డాట్ బాల్స్ వేసిన జట్టుగానూ ఇంగ్లండ్(2016లో vs SA) సరసన నిలిచింది.

February 27, 2026 / 06:43 AM IST

ఇంకా డేంజర్ జోన్‌లోనే టీమిండియా

జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్‌పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్‌రేట్ కలిగిన విండీస్ ముందుకు వెళ్తుంది. ఇలా ఓడినా, వర్షం పడినా డిఫెండింగ్ ఛాంప్ భారత్ ఖాళీ చేతులతో నిష్క్రమించాల్సిందే.

February 27, 2026 / 12:20 AM IST

T20 WC: భారత్ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచులో భారత్ 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 184/7కే పరిమితమైంది. ఆ టీమ్ తరఫున బెనెట్ 97* పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవం కాగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 26, 2026 / 10:33 PM IST

15 ఓవర్లు.. పోరాడుతున్న జింబాబ్వే

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257 రన్స్‌.

February 26, 2026 / 10:06 PM IST

T20 WC: జింబాబ్వేపై భారత్ ‘సిక్సర్ల’ వర్షం

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 17 సిక్సర్లు బాదారు. T20 WCలోని ఒకే మ్యాచ్‌లో టీమిండియా ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ప్రస్తుత WCలో భారత్ మొత్తంగా 63 సిక్సర్లు నమోదు చేసింది. దీంతో ఒకే WC ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. వెస్టిండీస్ ఇదే ప్రపంచకప్‌లో 66 సిక్సర్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

February 26, 2026 / 09:44 PM IST