• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

పాక్ గెలిస్తే లంకలో.. ఓడితే భారత్‌లో సెమీస్

2026 T20 WCలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయి. తొలి సెమీస్ మార్చి 4న ఈడెన్ గార్డెన్స్, రెండో సెమీస్ మార్చి 5న వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. మార్చి 8న జరిగే ఫైనల్‌కు మోదీ స్టేడియం వేదిక కానుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ చేరితే.. తొలి సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.

February 28, 2026 / 09:48 PM IST

జమ్మూకశ్మీర్‌ జట్టుకు భారీ న‌జ‌రానా

67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేస్తూ.. జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించారు. జట్టు మొత్తానికి రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 09:16 PM IST

BREAKING: పాకిస్తాన్ భారీ స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (100) ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ ఫకర్ జమాన్(84) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి పాక్ 20 ఓవర్లలో 212/8 భారీ స్కోరు సాధించింది. అయితే, పాక్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.. ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది.

February 28, 2026 / 08:50 PM IST

మార్పులు లేకుండానే బరిలోకి..!

వెస్టిండీస్‌తో రేపటి మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై విజయం సాధించిన విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి సంజూ, అభిషేక్ జోడీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. అదే ప్లేయింగ్-11తో విండీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది.

February 28, 2026 / 08:37 PM IST

T20 WC: పాక్ vs లంక మ్యాచ్‌పై అనుమానాలు!

శ్రీలంకతో మ్యాచ్‌లో పాక్ ప్రస్తుతం 15 ఓవర్లలో 163/0 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. పాక్ సెమీస్ చేరాలంటే 65 పరుగుల తేడాతో లేదా 13 ఓవర్లలోపే గెలవాల్సి ఉండగా.. టాస్ గెలిచి లంక బౌలింగ్ ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. PAK క్వాలిఫై అయితేనే సెమీస్ లంకలో జరుగుతుంది. ఈ క్రమంలోనే లంక కావాలనే పాక్‌తో కుమ్మక్కైందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

February 28, 2026 / 08:15 PM IST

T20 WC: రేపు భారత్-విండీస్ నాకౌట్ ఫైట్

టీ20 ప్రపంచకప్‌లో రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉండగా, గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. దీంతో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

February 28, 2026 / 08:10 PM IST

T20 WC: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ క్రమంలో గతంలో 319 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును, ఫర్హాన్ (323*) అధిగమించాడు.

February 28, 2026 / 07:32 PM IST

PAK vs SL: ప్లేయింగ్-11

PAK: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్SL: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(w), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(c), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

February 28, 2026 / 06:40 PM IST

T20 WC: పాకిస్తాన్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం 65 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాగా, శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

February 28, 2026 / 06:38 PM IST

కెప్టెన్‌పై వేటుకు పీసీబీ సిద్ధం..!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. T20 WC అనంతరం కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జట్టు పేలవ ప్రదర్శనపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఆఘా, బాబర్, ఉస్మాన్ ఖాన్‌లను T20 జట్టు నుంచి పూర్తిగా తప్పించనున్నట్లు సమాచారం.

February 28, 2026 / 05:30 PM IST

కివీస్ ప్లేయర్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు అందుకున్నాడు. జనవరి నెలకు గాను ‘ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్, ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను వెనక్కి నెట్టి మిచెల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. కాగా, మహిళల విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తరీ ఈ అవార్డును దక్కించుకుంది.

February 28, 2026 / 05:21 PM IST

ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ అజేయ రికార్డు

T20 WCలో వెస్టిండీస్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ రికార్డు ఉంది. ఇదే వేదికపై జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి వెస్టిండీస్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తంగా T20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విండీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

February 28, 2026 / 04:38 PM IST

ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద..?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం. రెండు జట్లలోనూ విధ్వంసకర పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

February 28, 2026 / 04:15 PM IST

జమ్మూకశ్మీర్ కలని నిజం చేసిన స్పీడ్ స్టర్

జమ్మూకశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ఆ జట్టు బౌలర్ అఖిబ్ నబీ దార్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్, సెమీస్‌లో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు.

February 28, 2026 / 02:58 PM IST

పర్వేజ్ రసూల్ ఎమోషనల్ పోస్ట్

రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ పర్వేజ్ రసూల్ ఆనందం వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీ గెలవాలన్న తమ దశాబ్దాల కల ఈ రోజు నిజం కాబోతున్నట్లు తెలిపాడు. అలాగే, బౌలర్ అఖిబ్ నబీని పర్వేజ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కాగా, కర్ణాటకతో జరుగుతున్న రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం లాంఛనమే.

February 28, 2026 / 02:25 PM IST