తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను ఓడించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారని.. స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా అద్భుత ఆటతీరు ప్రదర్శించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సెంచరీలు వీరులు గిల్, పంత్‌పైనా ప్రశంసలు కురిపించాడు. తాము భారత్‌లో ఆడినా.. వెలుపల ఆడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు పోరాడతామని.. జట్టును అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నామని చెప్పాడు.