బంగ్లాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చిన గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీతో అతడి స్థానంపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. “నేను ఈ స్థానంలో ఆడగలననే నమ్మకం ఎప్పుడూ ఉంది. ఏ స్థానంలో ఆడామన్నది విషయం కాదు. ప్రదర్శన ఎలా ఉందనేదే ముఖ్యం. ఇండియా A, రంజీల్లో 5, 4, 3 స్థానాల్లో కూడా పరుగులు చేశాను. ఓపెనింగ్‌లో కూడా రాణిస్తాననే నమ్మకం నాకుంది” అని అన్నాడు.