చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించడంపై జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘‘అద్భుతమైన ఆరంభం. బాగా ఆడారు అబ్బాయిలు’’ అని పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచులో 515 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో రాణించాడు. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో గెలుపొందింది.