Neetoo Gangas : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నీతుకు గోల్డ్
మహిళల ప్రపంచ బాక్సింగ్ (World Boxing) ఛాంపియన్షిప్లో ఫైనల్స్ లో భారత బాక్సర్ నీతూ గాంగాస్ (Neetoo Gangas) ఆదరగొట్టింది.ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం (gold) లభించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా (Mongolia) మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ (Lutsai Khan) అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది
మహిళల ప్రపంచ బాక్సింగ్ (World Boxing) ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత బాక్సర్ నీతూ గాంగాస్ (Neetoo Gangas) ఆదరగొట్టింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం (gold) లభించింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా (Mongolia) మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. ఈ పోరులో నీతూ 5-0తో ప్రత్యర్థిని చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. మొదటి నుంచి ప్రత్యర్ది పై పంచులతో 22 ఏళ్ల నీతు విరుచుకుపడ్డాది. ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకున్న నీతూ దూకుడు కనబరుస్తూ, విసురుతూ, వివిధ కాంబినేషన్లలో పంచ్ ల వర్షం కురిపించింది. ఈ విజయంతో నీతూ ఘంఘాస్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో (Championship) స్వర్ణం గెలిచిన 6వ భారత మహిళా బాక్సర్ గా నిలిచింది. గతంలో 2002, 2005, 2006, 2008, 2010, 2018లో మేరీ కోమ్ పసిడి పతకాలు నెగ్గగా… 2006లో సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, 2022లో నిఖత్ జరీన్ (Nikhat Zareen) ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించారు.