»Neeraj Chopra Wins Historic World Athletics Championship
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్
ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో భారత జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తా చాటాడు. స్వర్ణ పతకం సాధించి భారత కీర్తిని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అతన్ని యావత్ భారతం అభినందలతో ముంచెత్తుతోంది.
Neeraj Chopra wins historic World Athletics Championship
Neeraj Chopra: భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో అద్భుతంగా ఆడాడు. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. భారత కీర్తిని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. ఒలింపిక్స్‌లో భారత దేశానికి బంగారు పతకం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. హంగేరిలో గల బుడాపెస్ట్ వద్ద ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి.
క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా (Neeraj Chopra) 88.77 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. అలా ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ టైమ్ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరాడు. తర్వాత వరసగా 86.32, 84.64, 87.73, 83.98 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. 84.77 మీటర్లతో కిసోర్ జెనా ఐదో స్థానంలో ఉండగా.. డీసీ మను 84.14 మీటర్ల దూరంతో ఆరో స్థానంలో ఉన్నాడు.
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన నీరజ్ చోప్రా
బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో నీరజ్ చోప్రా 88.17 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు.https://t.co/13pvwgqDLH
ఛాంపియన్ షిప్లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరి.. రజత పతకం గెలిచాడు. చెక్ ప్లేయర్ జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం సాధించాడు. పురుషుల 4*400 మీటర్ల రిలే విభాగంలో భారత బృందం 2.59.92 సెకన్లతో రేసు ముగించి.. ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 3000 స్టీపుల్ చెజ్ విభాగంలో భారత క్రీడాకారిణి పరుల్ చౌదరి 11వ స్థానంలో నిలిచారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణ పతకం సాధించడంపై యావత్ భారత దేశం అభినందిస్తోంది. శభాష్.. నీరజ్, నువ్వు దేశానికి మరింత పేరు తీసుకొచ్చావ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.