»Pak Vs India Match In Asia Cup Pak Captain Made Important Comments
Asia Cup 2023: ఆసియా కప్‌లో పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్..కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ కెప్టెన్!
ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఈ నెల చివరి నుంచి టోర్నీ మొదలు కానుంది. వచ్చే నెల 2వ తేదిన భారత్, పాక్ దేశాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో దాయాది జట్ల మ్యాచ్‌పై సర్వత్రా చర్చ మొదలైంది.
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్-2023 (Asia Cup 2023) టోర్నీ ప్రారంభం కానుంది. ఆగస్టు 30వ తేది నుంచే టోర్నీ జరగనుండటంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌కు ముందుగా పాక్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డే సిరీస్‌లు ఆడింది. ఆ మూడింట్లోనూ విజయం సాధించడంతో ఇప్పుడు వన్డే ర్యాకింగ్స్లోనే పాక్ మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా కప్‌లో కూడా అదే ఊపుతో ఆడేందుకు పాక్ సిద్ధమవుతోంది.
మరోవైపు ఆసియా కప్ టోర్నీ (Asia Cup 2023)లో పాక్ వర్సెస్ భారత్ జట్ల మ్యాచ్ (PAK vs IND) కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 2వ తేదిన ఈ దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుందని, క్రికెట్ అభిమానులతో కూడా తాము కూడా ఎంజాయ్ చేస్తామని అన్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా వందశాతం ప్రయత్నించి విజయం కోసం కష్టపడుతామన్నారు.
పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవలె టీమిండియా (Teamindia) క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajith agarkar) కొన్ని విషయాలు ప్రస్తావించారని, అయితే చివరికి ఎవరు పైచేయి సాధిస్తారనేది మ్యాచ్ రోజునే తెలుస్తుందని షాదాబ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. తమనుంచైనా, భారత జట్టు నుంచైనా ఎవరైనా సరే గెలవాలనే కోరుకుంటారని, బరిలోకి దిగినప్పుడే అసలైన సత్తా బయటికొస్తుందన్నారు.