శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) తన సోదరి వివాహంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా చెల్లిని, బావను కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. చెల్లితో అనుబంధాన్ని (attachment) గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు. ఇదే సమయంలో అతని చెల్లి, బావ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియా(Social media)లో వైరలవుతుంది. ఇది చూసి నెటిజన్లు అన్ని బంధాల కంటే అన్నాచెల్లెల్ల అనుబంధం చాలా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు.
చెల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. హసరంగ చెల్లి (Sister) కూడా భోరున విలపించింది. హసరంగ తన బావని దగ్గరకు తీసుకుని.. సిస్టర్ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఐపీఎల్(IPL)లో హసరంగ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30 నుంచి శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ (Asia Cup) ప్రారంభంకానుంది. ప్రస్తుతం అతడు తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గ్రూప్ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని శ్రీలంక జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఒకవేళ హసరంగ (Hasaranga) కోలుకోకపోతే శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.