ఆసియా క్రీడల్లో(Asian Games)భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.భారత అథ్లెట్లు ఖాతాలోకి మరో రెండు పతకాలు చేరాయి. రెజ్లింగ్‌లో కాంస్యం, పరుగు పందెంలో సిల్వర్ పతకాలు వచ్చాయి. భారత రెజ్లర్ సునీల్ కుమార్ (Sunil Kumar) ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో భారత్‌కు చెందిన హర్మిలన్ బెయిన్స్ రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది.
నీరజ్ చోప్రాకు గోల్డ్ ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఏషియన్ గేమ్స్ లో దుమ్మురేపారు. జావెలిన్ ను 88.88 మీ. విసిరి బంగారు పతకం కొల్లగొట్టారు. మరో భారత జావెలిన్ త్రోయర్ (Javelin throw) కిశోర్ కుమార్ జెనా సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్లో ఈ ఇద్దరు అథ్లెట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరూ ఒకరికి మించి మరొకరు జావెలిన్ విసిరారు. కానీ చివరికి నీరజ్‌ని పసిడి (Gold) ముద్దాడింది. అతడికి గట్టి పోటీ ఇచ్చిన కిశోర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.