»Tdp Mla Kotamreddy Sridhar Reddy Participated In The Rally Under The Eyes Of The Ap Politics Police
AP Politics: పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీలో ఎమ్మెల్యే కొటంరెడ్డి
చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ బాబుకు మద్దతుగా నెల్లూరులో మిత్రపక్షాలు ర్యాలీ చెపట్టారు. అయితే ర్యాలీకి పోలీసుల అనుమతి లేకపోవడంతో జిల్లాలోని కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. అధికారుల కళ్లు కప్పి మరి ఎమ్మెల్యే కోటంరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.
TDP MLA Kotamreddy Sridhar Reddy participated in the rally under the eyes of the AP Politics police
AP Politics: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ(TDP), జనసేన(Janasena), సీపీఐ(Cpi) శ్రేణులు నెల్లూరులో ర్యాలీ చేపట్టారు. నెల్లూరులోని వీఆర్సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణరెడ్డి, నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అయితే, ముందు ఈ ర్యాలీకి అనుమతి పోలీసులు అనుమతి లభించలేదు. అందుకనే ఈ రోజు ఉదయం నుంచే నెల్లూరులోని ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధాలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. మాగుంట లేఅవుట్లో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసుల రాక తెలిసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసుల కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్యే కోసం గాలించారు. తీరా వీఆర్సీ కూడలి వద్ద ఆయన ర్యాలీలో కనిపించారు. ఆజ్ఙాతంలోకి వెళ్లినా ఆయన ఆంక్షలు దాటి, పోలీసులు కళ్లు కప్పి తన గన్మెన్లను వదిలేసి ఆటోలో వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇది చట్టాన్ని అతిక్రమంచిడం కోణంలో చూస్తున్నారు.