MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ హుక్కాను పీలుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ స్మోకింగ్ చేసే వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. సూట్ ధరించి ఉన్న ధోనీ చేతిలో హుక్కా పైప్ కనిపిస్తోంంది. అయితే కొందరు ఇది యాడ్ షూటింగ్ అని మరికొందరు న్యూఇయర్ పార్టీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ధోనీ హుక్కా తాగడాన్ని ఇష్టపడతాడని.. తరచూ తన గదిలో హుక్కా సెటప్ చేసేవాడని ఆస్ట్రేలియా మాజీ స్టార్ జార్జ్ బెయిలీ గతంలో తెలిపారు.
ధోనీ గదిలో సెటప్ చేసిన హుక్కాకి ఎవరైనా వెళ్లవచ్చని.. అక్కడ చాలామంది యువ ఆటగాళ్లు ఉండవచ్చని గతంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ జార్జ్ బెయిలీ తెలిపాడు. అయితే తన ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకు్న ధోనీ ఇలా హుక్కా తాగుతూ కెమేరా కంటికి చిక్కడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ట వైరల్ అవుతోంది.