ఆసియా గేమ్స్ (Asia Games)లో భారత్ (India) పతకాల వేటను కొనసాగిస్తోంది. తాజాగా 10 వేల మీటర్ల పరుగు పందెంలో భారత్ అథ్లెట్ కార్తీక్ కుమార్ రజత పతకం, గుల్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలిచారు. పురుషుల స్క్వాష్ విభాగంలో భారత్ పాక్‌పై విజయం సాధించింది. స్క్వాష్‌లో భారత్ బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. ఇకపోతే టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న, రుతుజ జోడీ స్వర్ణం పతకాన్ని సాధించారు.
ఇప్పటి వరకూ భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 38కి చేరగా అందులో 10 బంగారు పతకాలు, 14 రజత పతకాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారత్ బాక్సర్లు లవ్లీనా బార్గోహెయిన్, ప్రీతి, నరేందర్‌లు ఇప్పటికే పతకాలు గెలుచుకున్నారు.
బ్యాడ్మింటన్ మెన్స్ (Badminton Mens) విభాగంలో భారత్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దక్షిణ కొరియా ఆటగాడు ఛోని శ్రీకాంత్ ఓడించాడు. దీంతో ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్ దూసుకెళ్లాడు. ఫైనల్ మ్యాచ్‌లో చైనా ఆటగాడితో శ్రీకాంత్ పోటీపడనున్నాడు. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాకింగ్స్లో మొదటి స్థానానికి చేరుకున్న ఏకైక భారతీయుడు కావడం విశేషం. 2021 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ లో ఫైనల్‌కు చేరుకున్న ఏకైక భారతీయుడిగా శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఆసియా గేమ్స్‌లో కూడా స్వర్ణం సాధిస్తాడని భారతీయులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.