»India Squash Team Defeated The Pakistan Team Asian Games 2023 And Won The Gold
Asian games 2023: పాక్ జట్టును చిత్తుగా ఓడించి స్వర్ణం గెల్చుకున్న భారత్
ఆసియా క్రీడల్లో(asian games 2023) స్క్వాష్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ స్వర్ణ పతకం గెల్చుకుంది. పాకిస్తాన్ జట్టును 2-1 తేడాతో ఓడించింది.
India squash team defeated the Pakistan team asian games 2023 and won the gold
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో ఏడో రోజు భారత ఆటగాళ్ల అదరగొడుతున్నారు. ఇప్పటికే టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ బోపన్న జోడి 9వ స్వర్ణం గెల్చుకోగా..తాజాగా భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్(Pakistan) జట్టను ఓడించి గోల్డ్ పతకం గెల్చుకుంది. దీంతో భారత్ ఖాతాలో 10 స్వర్ణాలు చేరాయి. ఈ వారం ప్రారంభంలో భారత్ గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయింది. కానీ తాజాగా జరిగిన మ్యాచులో సౌరవ్ ఘోషల్ రెండో మ్యాచ్‌లో వరుస సెట్ల విజయంతో భారత్ స్థాయిని డ్రా వరకు తీసుకొచ్చాడు. భారత స్క్వాష్ ఆటగాడు తన మ్యాచ్ ప్రారంభ దశలో వెనుకబడ్డాడు. అయితే తిరిగి పుంజుకుని ముహమ్మద్ అసిమ్ ఖాన్‌ను 3-0 (11-5, 11-1, 11-3)తో ఓడించి భారత్‌ను వేటలో ఉంచాడు.
What a match, what a comeback!!
SQUASH: INDIA beat PAK 2-1 in the final (team event).
ఉత్కంఠభరితమైన డిసైడర్‌లో అభయ్ సింగ్ మొదటి గేమ్‌లో గెలిచి తర్వాతి రెండింటిలో ఓడిపోయాడు. అయితే భారత స్క్వాష్(squash) ఆటగాడు నూర్ జమాన్‌ను 3-2 (11-7, 9-11, 8-11, 11-9, 12-10)తో ఓడించి భారత్‌కు అనుకూలంగా టై సాధించాడు. 25 ఏళ్ల అభయ్ సింగ్ నిర్ణయాత్మక గేమ్‌లో రెండు ఛాంపియన్షిప్ పాయింట్లను సాధించి పాకిస్థాన్ జట్టను మట్టికరిపించాడు. భారత స్క్వాష్ ఆటగాళ్లు అక్టోబర్ 1న ప్రారంభమయ్యే సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లలో తదుపరి మ్యాచ్‌లో పాల్గొంటారు.
అయితే ఆసియా క్రీడల్లో స్క్వాష్(squash)లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. గతంలో కూడా 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రిడల్లో(asian games) భారత పురుషుల జట్టు గోల్డ్ గెలుపొందింది. అయితే అప్పుడు కూడా సౌరవ్ ఘోసల్, మహేష్ మంగోంకర్ ఇంచియాన్ ఛాంపియన్ టీమ్‌లో ఉన్నారు. 19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 10వ స్వర్ణం. ఈ స్వర్ణ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 13 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 36కి చేరుకుంది. ఏడో రోజు భారత్‌కు ఇదే రెండో బంగారు పతకం కావడం విశేషం.