»Hca Hyderabad Cricket Association Election Notification Released
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) ఎన్నికల నోటిఫికేషన్ను శనివారం విడుదల చేశారు. ఈ ఎన్నికలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోసం, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ కోసం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రెసిడెంట్గా అజారుద్దీన్ పదవీకాలం పూర్తి అయ్యింది. దీంతో సుప్రీం కోర్టు హెచ్సీఏ ఎన్నికలకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీని వేసింది.
జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇప్పటి వరకూ కూడా హెచ్సీఏ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. హెచ్సీఏ యాజమాన్యంలోని 57 క్లబ్బులపై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఆయన నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, జాన్ మనోజ్, చార్మినార్ క్రికెట్ అసోసియేషన్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ అసోసియేషన్లు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ ఎన్నికలు జరగలేదు.
ఈ విషయంలో కోర్టులు ఇచ్చే ఆదేశాలు చెల్లవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టులకు కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో హెచ్సీఏ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
అక్టోబర్ 4వ తేది నుంచి 7వ తేది వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 16 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. అక్టోబరు 20వ తేదిన ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే రోజు తీర్పును కూడా వెల్లడించనున్నారు.