ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. బ్యాటింగ్ చేపట్టిన లక్నో 159 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది.
ఐపీఎల్(IPL)లో నేడు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants) టీమ్ తో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు తలపడుతోంది. మ్యాచ్లో భాగంగా మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) 74 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అయిన కైల్ మేయర్స్ 29 పరుగులు చేశాడు.
వీరిద్దరి తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ (KL Rahul)కు మిగిలిన బ్యాట్స్ మెన్స్ నుంచి సహకారం అందలేదని చెప్పాలి. చివరి ఓవర్లో లక్నో వికెట్ల వరుసగా పడ్డాయి. ఆఖరి ఓవర్లో పంజాబ్ కెప్టెన్ శామ్ కరణ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలర్లు శామ్ కరణ్ 3 వికెట్లు తీశాడు. కగిసో రబాడా 2 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, సికిందర్ రజా ఒక్కో వికెట్ ను తీశారు. గత మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన లక్నో ఆటగాడు నికోలాస్ పూరన్ ఈ మ్యాచ్ లో తొలి బంతికే డకౌట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. 20 ఓవర్లలో లక్నో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్(Punjab Kings) ముందు 160 పరుగుల లక్ష్యం ఉంది.