»Ipl 2023 Harbhajan Singh Named 4 Teams That Will Qualify For The Playoffs
Harbhajan Singh: ప్లే ఆఫ్ కి చేరే నాలుగు జట్లు ఇవే: హర్భజన్ జోస్యం..!
ఐపీఎల్ 2023 చాలా హుషారుగా సాగుతోంది. అన్ని జట్లు ఒకదానిని మించి మరొకటి అదరగొడుతున్నాయి. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కష్టంగా మారింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టు ఏవో చెప్పడం చాలా కష్టంగా ఉంది. సీనియర్ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ విషయంలో జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ఈసారి ప్లేఆఫ్స్ చేరే జట్లను అంచనా వేయడం కాస్త కష్టమైన పనే. అయితే గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న విధానం చూస్తుంటే.. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది. సమష్టిప్రదర్శనలతో విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో వాళ్లు ప్లేఆఫ్స్ చేరేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉండటంతో పాటు ధోనీకి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు కచ్చితంగా టైటిల్ గెలవాలనుకుంటుంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఆ టీమ్‌లో నలుగురే ఆడుతున్నా.. జోష్ హజెల్‌వుడ్ రాకతో ఆర్సీబీ బలం పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులో ఉన్నా.. మిగతా జట్లు వెనక్కినెట్టే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకుంటుంది.’అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. మరి ఆయన చెప్పింది ఎంత వరకు కరెక్ట్ అవుతుందో చూడాలి.