దక్షిణ కొరియాలోని బుసాన్‌లో (Busan) జరుగుతున్న ఆసియా కబడ్డీ ఛాంపియన్ షిప్ లో భారత్ కబడ్డీ టీం (Kabaddi Team) విజయం సాధించింది. ఇరాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన భారత్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో 42-32 స్కోరు తేడాతో భారత్ విజయం సాధించింది. బుసాన్ గత జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఆసియా (Asia) కబడ్డీ పోటీలు జరిగాయి. గత ఎడిషన్‌లో సైతం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాను 14 పాయింట్ల తేడాతో ఓడించింది. కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో భారత్ విజేతగా నిలిచింది.
తొమ్మిది ఎడిషన్లలో మన జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ నెగ్గింది. భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ (Captain Pawan Sehrawat) సూపర్- 10తో సత్తా చాటాడు. అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 64-20తో హాంకాంగ్(Hong Kong)ను ఓడించింది. దాంతో టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇరాన్(Iran), జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు పోటీ పడ్డాయి. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇరాన్ రెండో స్థానంలో నిలిచి భారత్ తో ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న భారత్ సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్లోనే ఓడింది. ఈ సారి స్వర్ణం
(gold)నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది.