»India Pak Match Pak Won The Toss And Chose To Bat
India vs Pakistan: ఇండియా-పాక్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’(T20 world cup)లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాక్, ఇండియా(India vs Pakistan) మ్యాచ్ ప్రారంభమైంది. ‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’(T20 world cup)లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. పాక్, ఇండియా(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది.
భారత జట్టు(Team india)కు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఇకపోతే పాక్ జట్టుకు బిస్మా మరూఫ్ కెప్టెన్‌గా ఉంది. టీమిండియాకు సంబంధించి కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఆమె ఈ మ్యాచ్ వరకూ బెంచ్‌కే పరిమితం కానుంది.