»India And England Teams Competed In World Cup 2023 What Is Englands Target
IND vs ENG: ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?
వన్డే వరల్డ్‌కప్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ రోజు లక్నో వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఇరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇండియా ప్లేయర్స్‌ను కట్టడి చేసింది. వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా ఆడినా భారత్ నిర్ణీత ఓవర్లలో 229 పరుగులు చేసింది.
India and England teams competed in World Cup 2023. What is England's target?
IND vs ENG: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) వరుసగా ఐదు విజయాలతో దూసుకెళ్తున్న భారత్ నేడు ఇంగ్లాండ్‌తో బరిలో దిగి నిర్ణీత ఓవర్లలో 229 పరుగులు చేసింది. ఆదివారం లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా (IND vs ENG) ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. మొదటగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి నుంచి దూకుడు మీద బౌలింగ్ వేస్తూ భారత్ వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వికెట్లు కోల్పోయిన తరువాత నెమ్మదిగా ఆడింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు 230 టార్గెట్ ఫిక్స్ చేసింది రోహిత్ సేనా.
ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా నెమ్మదిగా ఆడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నాలుగో ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరువాత వచ్చిన కింగ్ కోహ్లీ 9 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 16 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 58 బంతుల ఆడి 39 పరుగులు చేశాడు. 101 బంతులు ఆడిన రోహిత్ శర్మ 87 పరుగులు సాధించాడు. జడేజా 13 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మహ్మాద్ షమీ(1), సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో 49 పరుగుల చేశాడు. బుమ్రా(15), కుల్దీప్ యాదవ్(9) పరుగులు చేశారు. బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి నుంచి మంచి ప్రదర్శనను కనబరిచారు. డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో 2 వికెట్లు తీశారు.