Ye mat sochna.. MS Dhoni’s viral relationship tip for bachelors
MS Dhoni: మాజీ క్రికెటర్ MS ధోని (MS Dhoni) ఇటీవల హాస్యనటుడు తన్మయ్ భట్, ఇన్ఫ్లుయెన్సర్ శరణ్ హెగ్డేతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఎన్నో వ్యక్తిగతమైన విషయాలను పంచుకున్నారు. బ్యాచిలర్లకు విలువైన సలహాలను అందిస్తూ, రిలేషన్‌షిప్‌లపై తన ఆలోచనలను పంచుకున్నారు. తన్మయ్ భట్ మాట్లాడుతూ.. తాను ఒంటరిగా ఉన్నానని, జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చే భాగస్వామి కోసం చూస్తున్నట్లు, దాని వలన ఇంటి జీవితం బాగుంటుందని అన్నారు. ధోనీని అడుగుతూ మీ వ్యక్తిగత జీవితంలో మరో వ్యక్తి వచ్చినప్పుడు మీ లైఫ్ ఎలా మారిందో మీకు గుర్తుందా అని అడిగారు. ఈ ప్రశ్నకు ధోని ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
ధోనీ సమాధానమిస్తూ… బ్యాచిలర్స్(bachelors), రిలేషన్షిప్లో ఉన్నవారికి ఒక అపోహ ఉంటుంది. తమ భాగస్వామి భిన్నంగా ఉంటుందని అనుకుంటారు. ఈ రోజు దాన్ని క్లియర్ చేస్తాను. రిలేషన్షిప్లో ఉంటే సంతోషంగా పెళ్లి చేసుకోవాలన్నారు. బ్యాచిలర్స్ ఎప్పుడు మీ జీవిత భాగస్వామి భిన్నంగా ఉంటుంది అనుకోవద్దని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.