IPLలో అత్యల్ప స్కోరు (49 పరుగులు) రికార్డు ఇంకా RCB పేరిటే ఉంది. ఈ రికార్డును ఇవాళ ఢిల్లీ బ్రేక్ చేసేలాగే కనిపించింది. ఒక దశలో DC 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో అంతా RCB పేరిట ఉన్న చెత్త రికార్డును ఢిల్లీ చెరిపేస్తుందని అనుకున్నారు. అయితే, పోరెల్ (19), జెమిసన్ (12) కలిసి 49 పరుగుల మార్క్‌ను దాటించారు. ప్రస్తుతం DC 11 ఓవర్లలో 58/7 పరుగులతో ఉంది.