చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూర్ జట్టును మట్టి కరిపించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది.
IPL2024: చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూర్ జట్టును మట్టి కరిపించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. చెన్నైలో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో CSK జట్టు బోణీ కొట్టింది. RCB జట్టును ఓడించి…శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న RCB జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాప్ డ్యూప్లెసిస్ ఆరంభంలో అదరగొట్టాడు. ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 20 బంతుల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్ వెల్ చేతులెత్తేశారు. డకౌట్ అయ్యారు. మరో ఆటగాడు కేమెరన్ గ్రీన్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఆ సమయంలో అనుజ్‌రావత్, దినేశ్ కార్తీక్‌లు జట్టును ఆదుకున్నారు. పరుగుల వరద పారించారు. 150 పరుగులు కూడా దాటదని అనుకున్న స్కోర్‌ను 173 వరకూ లాగించారు.
174 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై జట్టు ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్ రీచ్ అయింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇరగదీశాడు. మూడు ఫోర్లు మూడు సిక్సర్లు బాది జట్టుకు శుభారంభం ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 15 పరుగులే చేశాడు. అజింక్యా రహానే, డారిల్ మిచెల్‌లు పర్వాలేదనిపించారు. ఇక శివం దూబే, రవీంద్ర జడేజాలు చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు…అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. తొలిత బౌలింగ్ చేసేవాళ్లకి విజయావకాశాలు ఎక్కువుగా ఉంటాయని పిచ్ రిపోర్ట్ సందర్భంగా బ్రియాన్ లారా లాంటి దిగ్గజం చెప్పినప్పటికీ.. ఆ మాటలు ఆర్సీబీ జట్టు పట్టించుకోలేదు. గతంలో చెన్నైలో జరిగిన అనేక మ్యాచుల్లో ఛేజింగ్ చేసి ఓటమి పాలవ్వడంతో … తొలిత బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు ఫ్యాప్ డ్యూప్లెసిస్. ఆ నిర్ణయం ఆ జట్టు కొంప ముంచింది.