ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ అంతరాయ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 19/0గా ఉంది. క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (13*), మెక్‌స్వీనీ (2*) ఉన్నారు.