స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెనుదిరిగాడు.
అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్ ను ఓడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే నాదల్ కోర్టులో కాస్త తికమక పడ్డాడు. తుంటి గాయంతో కొంత వరకూ ఇబ్బంది పడుతూనే తన ప్రదర్శనను కొనసాగించాడు. మెడికల్ టైమ్ ఔట్ కు తీసుకున్నప్పటికీ నాదల్ ఆ తర్వాత ఆడలేకపోయాడు. చివరికి తీవ్ర నిరాశతోనే నాదల్ టోర్నీ నుంచి వెళ్లిపోయాడు. నాదల్ ఓటమిని తట్టుకోలేక తన భార్య మరియా పెరెలో కంటతడి పెట్టుకుంది.