భారత్-ఆస్ట్రేలియా మహిళల సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ బౌలర్ క్రాంతి గౌడ్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీని క్లీన్ బౌల్డ్ చేసిన వెంటనే వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. ప్రస్తుతం ఆట నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.